మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై చ‌ర్చించాం ! 1 m ago

featured-image

సెప్టెంబ‌రులో వినాయ‌క చ‌వితి పండుగ సంద‌ర్భంగా ప్ర‌ధానితో న్యాయ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పైనే చ‌ర్చించిన‌ట్లు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్ స్ప‌ష్టంచేశారు. న‌వంబ‌రు 10న ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న నేప‌థ్యంలో వినాయ‌క‌చ‌వితి పండుగ‌కు ప్ర‌ధాని మోడీ సీజేఐ ఇంటికి రావ‌డం ప‌ట్ల ప‌లు ర‌కాల విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న దీనిపై స్పందించారు. ఇటువంటి సమావేశాలు సాధారణమైనవని, న్యాయపరమైన నిర్ణయాల కంటే న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమస్యలపై చర్చించడంపైనే త‌మ క‌ల‌యిక‌లో భాగ‌మైంద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు.

ఎప్పుడైనా న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌కే ప్రాధాన్య‌త‌

పండుగ సందర్భంగా చంద్రచూడ్ ఇంటికి ప్రధాని వచ్చిన నేపథ్యంలో విపక్షాలు ఈ సమావేశానికి సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. వీటిపై కాస్త ఆల‌స్యంగా ప్ర‌ధాన‌ న్యాయమూర్తి చంద్రచూడ్ స్పందిస్తూ, ఎవ‌రితోనైనా....ఎటువంటి....చర్చల్లోనైనా.. న్యాయపరమైన విషయాలను మాత్ర‌మే చ‌ర్చిస్తామ‌ని, ఇది రాజ్యాంగ‌బ‌ద్ద ప‌ద‌వుల్లో ఉన్న న్యాయ‌మూర్తుల‌కు, కార్య‌నిర్వాహ‌క అధికారుల‌కు ప్రాథ‌మిక సూత్ర‌మ‌ని తెలిపారు. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో త‌మ‌ విధులు త‌మకు తెలుసన్నారు. అదే స‌మ‌యంలో రాజకీయ పార్టీల నేత‌ల‌కు కూడా ఈ విష‌యాలు బాగా తెలుస‌న్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి స‌హా ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ‌మూర్తులు తాము నిర్వ‌హించిన చ‌ర్చ‌ల ద్వారా గ్రహించిన విష‌యాల్లో ఏదైనా ముప్పు ఉన్న‌ట్ల‌యితే, న్యాయవ్యవస్థ స్వతంత్రత‌ ఆధారంగా మాత్ర‌మే నిర్ణ‌యం తీసుకుంటుంద‌నిపేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల్లో ఇదే త‌ర‌హా స‌మావేశాలు

వివిధ రాష్ట్రాల్లో ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో సమావేశం కావడం ఆనవాయితీ అని గుర్తుచేశారు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు, ముఖ్య‌మంత్రులు న్యాయపరమైన చర్చ కోసం ఎన్నడూ కలుసుకోరని స్ప‌ష్టంచేశారు. రాజకీయ వర్గాల్లో కూడా న్యాయవ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉండటంలోనే మన రాజకీయ వ్యవస్థ పరిపక్వత ఉందన్నారు. ఇటువంటి సమావేశాల ఆవశ్యకతను ఎత్తిచూపుతూ డీవై చంద్రచూడ్ ప్ర‌ధానితో త‌న స‌మావేశం కూడా అలాంటిదేన‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో తాము న్యాయ‌స్థానాల‌కు కొత్త కోర్టు భవనాలు, న్యాయమూర్తుల వసతితో సహా న్యాయపరమైన మౌలిక సదుపాయాల గురించి ప్రస్తావించడం జ‌రిగిందన్నారు. ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రుల స‌మావేశాల‌ను, ఆయ‌న వివిధ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. న్యాయమూర్తులు కొన్నిసార్లు సామాజిక సమావేశాలలో రాజకీయ నాయకులను కలుస్తారని, అయితే ఆ సందర్భాలలో వారి న్యాయపరమైన విష‌యాల‌ గురించి ఎప్పుడూ చర్చించరని పేర్కొన్నారు.

విప‌క్షాల ఎదురు దాడి, బీజేపీ స‌మ‌ర్ధ‌న‌

ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఇంటికి ప్రధాని మోదీ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. శివసేన (యుబిటి) మరియు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య గొడవకు సంబంధించిన కేసు నుండి వైదొలగాలని శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ డివై చంద్రచూడ్‌ను కోరారు. పార్టీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. సేన వర్సెస్ సేన కేసులో పదేపదే వాయిదా వేయడాన్ని ఎత్తి చూపారు. ఈ క్ర‌మంలోనే 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌ హాజరయ్యారని, బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా విపక్షాల విమర్శలపై మండిపడ్డారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD